కిడ్నీ తీసుకుని డబ్బు ఎగ్గొట్టాడు... సినీ నటుడు బాలాజీపై జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి ఫిర్యాదు
- కిడ్నీ ఇస్తే రూ. 20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు
- ఇప్పటి వరకు రూ. 3 లక్షలే ఇచ్చాడు
- తప్పుడు పత్రాలు సృష్టించి మోసం చేశాడు
ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ, న్యాయం చేయాలని కోరుతూ... జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, మా అసోసియేషన్ లకు ఫిర్యాదు చేశామని చెప్పింది. లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, తన ఇంటి పైపోర్షన్ ను రాసిస్తానని, సినిమా క్యారెక్టర్లను ఇప్పిస్తానని బాలాజీ మాయమాటలు చెప్పి, మోసం చేశాడని తెలిపింది. లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని చెప్పింది.