మీ ప్రసంగాల వల్ల ఒరిగేదేమీ లేదు: మోదీపై సోనియాగాంధీ విమర్శలు
- మోదీ ప్రసంగాలతో పేదల కడుపు నిండదు
- కడుపు నిండాలంటే అన్నం, పప్పు ఉండాలి
- సిద్ధరామయ్య ప్రభుత్వం పేదలకు సబ్సిడీలపై ఆహారాన్ని అందించింది
కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజానీకం ఘన విజయాన్ని అందించబోతున్నారని చెప్పారు. ప్రసంగించడంలో ప్రధాని మోదీ మంచి నేర్పరి అని... అయితే ఆయన ప్రసంగాలు పేదల కడుపు నింపవని, అనారోగ్యం నుంచి కాపాడలేవని ఎద్దేవా చేశారు. కడుపు నిండాలంటే అన్నం, పప్పు కావాలని, అరోగ్యం కావాలంటే హెల్త్ సెంటర్లు కావాలని చెప్పారు. పేదలకు కూడా మంచి ఆహారం ఉండాలనే గొప్ప లక్ష్యంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సబ్సిడీపై ఆహారాన్ని అందించిందని సోనియా అన్నారు.