Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2014 నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్కించండి: మంత్రులకు మోదీ ఆదేశం

  • ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన మోదీ
  • ఇచ్చిన హామీని మోదీ నెరవేర్చలేకపోయారంటూ విపక్షాల ఆరోపణలు
  • ఇచ్చిన ఉద్యోగాలను లెక్కించాలంటూ మంత్రులను కోరిన మోదీ
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలను ఇచ్చామో లెక్కించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. తమతమ శాఖల పరిధిలో ఎన్ని ఉద్యోగాలను కల్పించారో సంబంధిత మంత్రులు పూర్తి వివరాలను అందించాలంటూ కోరారు. ప్రతియేటా 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మోదీ... చేతల్లో ఆ పని చేయలేకపోయారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ తన మంత్రివర్గానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీనితోపాటు, జీడీపీపై వివిధ పథకాల ప్రభావాన్ని కూడా లెక్కించాలని కోరారు. 
Narendra Modi
jobs

More Telugu News