వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికే అది సాధ్యం ..ఇదిగో వీడియో!: హీరో నాని
- ‘మహానటి’లో ఎస్వీరంగారావు పాత్రలో మోహన్ బాబు
- ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్
- వాయిస్ ఓవర్ చెప్పిన హీరో నాని
‘పౌరాణికమైనా, సాంఘికమైనా..ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణనటుడు.. మన ఘటోత్కచుడంటే ఎస్వీ రంగారావుగారని ప్రతి తెలుగువాడు ఇట్టే చెప్పేస్తారు. ‘వివాహభోజనంబు వింతైన వంటకంబు’ అని అన్ని తెలుగు ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీఆర్ దే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందింది మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మన ముందుకు రాబోతున్నది ఎవరా అనుకుంటున్నారా? ఎస్.. మీ గెస్ కరెక్టే.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికే అది సాధ్యం’ అని నాని పేర్కొన్నారు.