Hyderabad: హైదరాబాద్ ‘మెట్రో’లో మహిళలకు ప్రత్యేక బోగీ

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే మహిళలకు శుభవార్త. ప్రస్తుతం నడుస్తున్న అన్ని మెట్రో రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి రానుంది. ప్రతి మెట్రో రైలులో ఉన్న మూడు బోగీల్లో మొదటి బోగీని మహిళలకు కేటాయించనున్నారు. ‘మెట్రో’లో మహిళలకు కేటాయించిన ప్రత్యేక బోగీని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఎల్ అండ్ టి మెట్రో సీఈవో, ఎండీ కేవీబీ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. కాగా, గత ఏడాది చివరలో హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో సేవలందుతున్నాయి.
Hyderabad
metro rail

More Telugu News