నా కళ్లే నాకు మొదటి అవకాశాన్ని తెచ్చిపెట్టాయి: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కళ్లే నాకు మొదటి అవకాశాన్ని తెచ్చిపెట్టాయి: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ

  • భరతనాట్యం నేర్చుకున్నాను 
  • నటన పట్ల ఆసక్తి వుంది 
  • ఫస్టు మూవీ సెట్ కి కృష్ణారెడ్డి వచ్చారు
తెలుగు తెరపై గ్లామర్ పరంగాను .. నటనపరంగాను మంచి మార్కులు కొట్టేసిన నిన్నటి తరం కథానాయికగా ఇంద్రజ కనిపిస్తారు. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అలాంటి ఇంద్రజ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాల గురించి ప్రస్తావించారు. " సినిమాల్లోకి రావడానికి ముందు నేను 'భరతనాట్యం' ప్రదర్శనలు ఇచ్చేదానిని. నటన పట్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వుంది .. అందువలన నటిగా నాలోని టాలెంట్ ను బయటికి తీసుకురావాలని మా నాన్నగారికి ఉండేది" అని చెప్పారు.

"ఒకరి సలహా మేరకు ఆయన ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలు చూసిన దర్శకులు భరత్ నాకు కబురు చేశారు. 'జంతర్ మంతర్' సినిమా కోసం నాలాంటి కళ్లున్న అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నారట. నేను వెళ్లి కలవడం .. సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఆ సినిమా చేస్తుండగానే ఎస్వీ కృష్ణారెడ్డిగారు సెట్ కి వచ్చి 'యమలీల' సినిమా కోసం నన్ను ఓకే చేశారు" అని చెప్పుకొచ్చారు.  
indraja

More Telugu News