వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లిన మహిళా పోలీసులు!
- మైనర్ బాలికను గుంటూరు ఆసుపత్రిలో పరామర్శించిన రోజా
- రోడ్డుపై వైసీపీ ఎమ్మెల్యేల రాస్తారోకో
- రోజా, ముస్తఫా, గోపిరెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
దీనికి ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రోజా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ, బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందని చెప్పారు. మగాళ్లు అంటేనే ఆ అమ్మాయి భయపడిపోతోందని తెలిపారు. ఆసుపత్రిలోని గదిలోకి హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చినా భయంతో హడలిపోతోందని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటసేపు రేప్ చేసి పోతుంటే... మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు.