గతంలో తనకు వెంట్రుకలు పెరిగేందుకు మందిచ్చిన డాక్టర్ పై దాడులు చేయించిన డొనాల్డ్ ట్రంప్!
- ట్రంప్ బాడీగార్డులు దాడి చేశారు
- ఆరోపించిన డాక్టర్ హెరాల్డ్ బోర్న్ స్టెయిన్
- వైద్య నివేదికలు సేకరించామన్న వైట్ హౌస్
ట్రంప్ దీర్ఘకాల బాడీగార్డ్ కీత్ స్కిల్లర్ తన వద్దకు వచ్చారని, ఆయనతో పాటు అప్పటి వైట్ హౌస్ కార్యకలాపాల నిర్వహణాధికారి అలెన్ గార్టెన్, ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న నిర్మాణ రంగ సంస్థకు చెందిన లాయర్ తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. ట్రంప్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టుల ఒరిజినల్ కాపీలు, పలు రకాల డాక్యుమెంట్లను వారు తీసుకుని వెళ్లారని తెలిపారు. కాగా, దాడి వార్తలు ఆరోపణలేనని, కల్పితాలని వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడి గత వైద్య పరీక్షలకు, వాటి ఫలితాలకు సంబంధించిన రికార్డులు సేకరించడం వైట్ హౌస్ హక్కని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.