సీ ఫోర్ సర్వేలో బీజేపీకి షాక్... కాంగ్రెస్ దే కర్ణాటక!
- కాంగ్రెస్ 118 నుంచి 128 సీట్లు
- 63 నుంచి 73 సీట్లకు బీజేపీ పరిమితం
- సీ ఫోర్ తాజా సర్వే
ఇక మార్చి 2018లో నిర్వహించిన తాజా సర్వే తరువాత కాంగ్రెస్ కు 126, బీజేపీకి 70, జేడీఎస్ కు 27 నుంచి 40, ఇతరులకు 1 స్థానం వస్తాయని పేర్కొంది. ఆపై ఏప్రిల్ లో మరో సర్వే చేసి కాంగ్రెస్ కు 118 నుంచి 128, బీజేపీకి 63 నుంచి 73, జేడీఎస్ కు 29 నుంచి 36, ఇతరులకు 2 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదిలావుండగా సీ ఫోర్ సంస్థ 2013 నుంచి ప్రకటించిన పలు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో 99 శాతం కరెక్టుకావడం గమనార్హం.