మారువేషంలో వచ్చి.. చిన్నారులతో బ్రెట్ లీ క్రికెట్.. వీడియో చూడండి
- వృద్ధుడి వేషంలో చిన్నారుల వద్దకు బ్రెట్ లీ
- బౌలింగ్, బ్యాటింగ్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన చిన్నారులు
- చివరకు బ్రెట్ లీ అని తెలుసుకుని ఆనందానికి లోనైన చిన్నారి క్రికెటర్లు
తొలుత తనకు క్రికెట్ తెలియదని చెప్పిన ఆయన... ఆ తర్వాత బౌలింగ్, బ్యాటింగ్ లో తన టాలెంట్ చూపి చిన్నారులను ఆశ్చర్యానికి గురి చేశాడు. చాలా బాగా ఆడారు, ఇంత మంచి క్రికెట్ ఆడటం మీకు ఎలా వచ్చు? అని చిన్నారులు ప్రశ్నించడంతో... చివరకు తన మారువేషాన్ని తీసివేశాడు. సాక్షాత్తు బ్రెట్ లీ తమ ముందు ఉండటంతో... చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చి బ్రెట్ లీ సంతోషపెట్టాడు.