'నా పేరు సూర్య' చిత్రంపై కుట్రలు: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- నాలుగు రోజుల్లో విడుదల కానున్న 'నా పేరు సూర్య'
- సినిమాను ఫ్లాప్ చేసేందుకు కుట్రలు
- కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న అల్లు అరవింద్
ఈ నిర్ణయాలు కొందరికి నష్టం కలిగించాయని, ఆ కారణంతో సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేయనున్నారని, మిక్స్ డ్ టాక్ తీసుకురావడానికి, విమర్శలు గుప్పించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. వారి కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు. సినిమా బాగుంటే ప్రతి ఒక్కరూ హర్షిస్తారని చెప్పిన ఆయన, ఈ గొడవల్లో కనెక్ట్ కావద్దని బన్నీకి సూచించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని, ఇంతకన్నా ఇప్పుడేమీ మాట్లాడలేనని, సక్సెస్ మీట్ లో మాట్లాడతానని గర్వంగా చెప్పగలనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.