మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌

  • సీనియర్లను కలుపుకుని వెళ్లాలని సూచన
  • పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సుబ్బారెడ్డికి భరోసా
  • సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారన్న అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద ఆళ్లగడ్డ రాళ్లదాడి పంచాయితీ ముగిసిన విషయం తెలిసిందే. మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో చంద్రబాబు.. విడివిడిగా, ఉమ్మడిగానూ చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అఖిల ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. ఈ విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలుపుతూ అఖిలప్రియకు చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు. అలాగే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు చెప్పారు.
Chandrababu
aklila priya
av subbareddy

More Telugu News