గూగుల్ ప్లే మ్యూజిక్ పోయి... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేస్తోంది!
- ఈ ఏడాది చివరికి గూగుల్ ప్లే సేవలు ఆగిపోయే అవకాశం
- దీన్ని ధ్రువీకరించిన గూగుల్
- ఈ ఏడాది చివరికి స్పష్టత
‘‘మ్యూజిక్ అన్నది గూగుల్ కు చాలా ముఖ్యమైనది. యూట్యూబ్ మ్యూజిక్, గూగుల్ ప్లే రెండూ అందిస్తామని గతంలో ప్రకటించాం. వినియోగదారులు, కళాకారుల అవసరాలను ఒక వేదిక ద్వారా చేరుకోవడం కష్టం. ఒకవేళ ఏదైనా మార్పులు చేయదలిస్తే ముందుగానే తెలియజేస్తాం’’ అని గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు. దీనిపై ఈ ఏడాది చివరికి గానీ మరింత స్పష్టత రానుంది. గూగుల్ ప్లేలో యూజర్లు ఉచితంగా వేలాది పాటలను అప్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే.