'ఇండియా తొలి ప్రధాని ఎవరంటే' నరేంద్ర మోదీ ఫొటో చూపిస్తున్న గూగుల్... నెటిజన్ల సెటైర్లు!

  • గూగుల్ సెర్చ్ బార్ తప్పిదం
  • మండిపడిన కాంగ్రెస్
  • సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోదీగా మార్చివేసింది. ఇండియా తొలి ప్రధాని అని సెర్చ్ చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కనిపిస్తుండటంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక సెర్చ్ చేస్తే తొలుతగా వికీపీడియా లింక్ ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్, పక్కనే నరేంద్ర మోదీ ఫోటోను చూపిస్తోంది.

ఇక ఈ తప్పిదంపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జ్ దివ్య స్పందన తీవ్రంగా మండిపడ్డారు. ఎటువంటి గూగుల్ ఆల్గోరిథమ్స్ దీనిని ప్రజలకు అందిస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. కాగా, ఈ తప్పు ఇప్పటికీ అలానే ఉంది. 'గూగుల్ డాట్ కో డాట్ ఇన్' సెర్చ్ బార్ లో 'India first PM' అని టైప్ చేస్తే నెహ్రూ పేరు, మోదీ ఫొటో వస్తున్నాయి.  దీని స్క్రీన్ షాట్ ను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
AP7AM
India
Google
Narendra Modi
Nehru

More Telugu News