పవన్ కల్యాణ్ తాజా ట్వీట్స్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తాను చదివిన పుస్తకాల్లో ఉన్న కొటేషన్లను తన ట్వీట్లలో ప్రస్తావించారు. ‘చెడ్డ మనుషులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రలజందరూ అనుకుంటారు, కానీ, మనం పోరాడాల్సింది వారిలో ఉన్న ‘చెడు’ పై’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.  మరో ట్వీట్ లో.. ‘‘సత్యం’ అనేది ఎల్లప్పుడూ బలమైన వాదన ..’ అని, ఇంకో ట్వీట్ లో.. ‘యోధుడి లోలోపల శక్తి ఉంటుంది : అతని గుండెలో, మనసులో, ఆత్మలో శక్తి ఉంటుంది’ అని పవన్ పేర్కొన్నారు. 

కాగా, తెలుగు నవల ‘ఖరవేలుడు’ నుంచి 2001లో తన జర్నల్ లో రాసుకున్న సారాంశమంటూ ఓ పోస్ట్ పొందుపరిచారు. ప్రపంచ నేతల్లో తనకు స్ఫూర్తి నిచ్చిన వారిలో దివంగత లీ క్వాన్ యూ ఒకరని, సింగపూర్ దేశాన్ని ఎలా నిర్మించారనే విషయం తెలుసుకోవాలంటే.. ఆయన జీవిత చరిత్రను మీరు చదవాలంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టూ ఫస్ట్.. ది సింగపూర్ స్టోరీ :1965 -2000.. లీ క్వాన్ యూ’ పుస్తకం పోస్టర్ ను పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
singapore

More Telugu News