ఉద్యోగం కావాలా...? గూగుల్ సెర్చ్ బార్ కు వెళ్లండి...1
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం కావాలా...? గూగుల్ సెర్చ్ బార్ కు వెళ్లండి...1

  • గూగుల్ నూతన సర్వీసు
  • టైమ్స్ జాబ్స్, క్వికర్ జాబ్స్ సహా ఎన్నో సంస్థలతో టై అప్
  • త్వరలో నౌకరి డాట్ కామ్ తోనూ భాగస్వామ్యం
ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి గూగుల్ చేయూతగా గూగుల్ ఫర్ జాబ్స్ ను తీసుకొచ్చింది. ఉద్యోగాన్ని ఆశించేవారు గూగుల్ సెర్చ్ బార్ నుంచే సులభంగా ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. ఐబీఎం ట్యాలెంట్ మేనేజ్ మెంట్ సొల్యూషన్స్, లింక్డెన్, క్వెజెక్స్, క్వికర్ జాబ్స్, షైన్ డాట్ కామ్, టీజాబ్స్, టైమ్స్ జాబ్స్, విస్డమ్ జాబ్స్, ఆసన్ జాబ్స్, ఫ్రెషర్స్ వరల్డ్, హెడ్ హాంకోస్ తదితర సంస్థలతో గూగుల్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

ఉద్యోగాల సమాచారం కోసం ఈ సంస్థల వెబ్ సైట్లను ఆశ్రయించక్కర్లేదు. మరెక్కడా వెతనక్కర్లేదు. గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేస్తే అన్ని వివరాలు వచ్చేస్తాయి. అందులో ఫలానా ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మరోసారి దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. లాగిన్ అవడం ద్వారా అలర్ట్ లు కూడా సెట్ చేసుకోవచ్చు. నౌకరి డాట్ కామ్ తోనూ టైఅప్ కానుంది.
google
employment

More Telugu News