ఏ పార్టీకి మద్దతివ్వాల్సిన అవసరం మాకు లేదు: తెలంగాణ మంత్రి హరీష్ రావు
- కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన హరీష్ రావు
- మద్దతు తెలపని పార్టీలను బీజేపీకి అనుకూల పార్టీలంటోంది
- తెలంగాణ ప్రయోజనాల కోసం ‘కాంగ్రెస్’ ఎందుకు పోరాడదు?
విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించిన ఆయన, ఈ రాష్ట్రంపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదంటూ దుయ్యబట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు రూ.750 కోట్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ని ఆహ్వానిస్తామని చెప్పారు.