పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ఊరుకోం: రోజా
- వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదు
- పవన్ ను చంద్రబాబు టార్గెట్ చేశారు
- క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు
పబ్లిసిటీ కోసం ఎవరైనా సరే ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ కూడా పోరాడుతుందని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో నియామకాలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని అన్నారు.