మా అమ్మను పబ్లిక్ గా తిట్టించే విషయంలో టీడీపీ బాసులకు సహకరించిన త్రయం ఇదే!: ఫొటోలు విడుదల చేసిన పవన్ కల్యాణ్

  • వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న పవన్
  • టీడీపీ బాసులకు వీరు ముగ్గురు సహకరించారు
  • నా తల్లిని పబ్లిక్ లో తిట్టించారు
తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డు మీద అసభ్యంగా తిట్టించి, దాన్ని పదేపదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి... అత్యంత దారుణంగా వ్యవహరించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై కూడా ఆయన మండిపడ్డారు. తాజాగా ఈ దారుణానికంతా ఈ ముగ్గురే కారణమంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. ఈ ముగ్గురూ కలసి పబ్లిక్ లో తన తల్లిని దూషించేందుకు తెలుగుదేశం పార్టీ బాసులకు సహకరించారని చెప్పారు. టీవీ9 రవిప్రకాశ్, శ్రీని రాజు, రామ్ గోపాల్ వర్మల ఫొటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.
Go Back to Shorts
pawan kalyan
ramgopal varma
tv9
raviprakash

More Telugu News