నా ఫిట్ నెస్ రహస్యం 'స్పెషల్ డైటే'.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రోజూ రెండు కేజీల విమర్శలు తీసుకుంటున్నాను
- విమర్శలు ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయి
- విమర్శలకు బాధపడలేదు
అలాగని విమర్శలకు బాధపడింది కూడా లేదని చెప్పారు. తనను విమర్శించాలని ఆయన కోరారు. విమర్శకుల కారణంగా తామెప్పుడూ అప్రమత్తంగా ఉంటామని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు విమర్శలు ఆరోపణల స్థాయికి దిగజారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశప్రజల స్వేచ్ఛ కోసం గాంధీ ఉద్యమం చేస్తే, తాను అభివృద్ధిని ప్రజాఉద్యమంగా మార్చానని తెలిపారు. తాను వెనుకబడిన వర్గం నుంచి వచ్చి, పేదరికంలో జీవించానని, అందుకే దేశ ప్రజల అవసరాలు తనకు తెలుసని ఆయన చెప్పారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి పని చేయాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.