కోల్‌కతాపై ఎవరెస్ట్ శిఖరాన్ని మించిన మేఘం.. తుపాన్లతో పశ్చిమబెంగాల్ అతలాకుతలం!
- జంట తుపాన్లతో పశ్చిమ బెంగాల్ అతలాకుతలం
- రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మృతి
- స్తంభించిన రవాణా వ్యవస్థ
తుపాను దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మరణించారు. కోల్‌కతాలో ఓ ఆటోపై చెట్టు కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆనంద్‌పూర్, బెహలా, హౌరాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కోల్‌కతాలో పది కిలోమీటర్ల ఎత్తులో 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ భారీ మేఘం కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేఘం ఎవరెస్టు శిఖరం కంటే 13 శాతం పెద్దగా ఉన్నట్టు చెప్పారు. ఈ మేఘం వర్షిస్తే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.