నాకింకా పెళ్లి కాదు... నా యవ్వనం, మిగిలిన జీవితం అందుకోసమే!: శ్రీరెడ్డి
- వివాహం అవుతుందని అనుకోవడం లేదు
- జీవితాంతం అమ్మాయిలను ఆదుకునేందుకే అంకితం
- సాయం కోసం చూస్తున్న అమ్మాయిలను ఆదుకుంటా
తన చిన్న వయసులో తమ్ముడు చనిపోయిన తరువాత, తిండి పెట్టే వారు కూడా లేకపోయారని, తమను ఎవరూ పట్టించుకోలేదని, నాలుగైదు రోజుల పాటు స్నానం చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. కనీసం సినిమా పాటలు కూడా ఇంట్లో వినిపించేవి కాదని వెల్లడించింది. టీవీలో ఏదైనా సినిమా చూస్తుంటే, రొమాంటిక్ సీన్ వస్తే, "నడవండి నడవండి... దిక్కు మాలిన మొహాల్లారా... ఇటువంటి వాటి కోసమే కాసుకుని కూర్చున్నారా?" అంటూ తిట్టి పంపేవారని గుర్తు చేసుకుంది.