పవన్ కల్యాణ్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పాలి : ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ డిమాండ్
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పాలి : ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ డిమాండ్

  • మేము మా దేవుడి టీమ్..గబ్బర్ సింగ్ టీమ్
  • 24 క్రాఫ్ట్స్ లో శ్రీరెడ్డికి ఏ క్రాఫ్ట్ లో మెంబర్ షిప్ ఉంది?
  • పవన్ కల్యాణ్ అమ్మ గురించి నువ్వు మాట్లాడతావా?
  • నువ్వు ‘సారి’ చెప్పేదాకా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరు
జనసేన పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు సినీ హీరోలు ఖండించారు. తాజాగా, ‘గబ్బర్ సింగ్’ సినిమాలో రౌడీ గ్యాంగ్ గా నటించిన నటులు స్పందించారు. ఈ సందర్భంగా యూట్యూబ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశారు.

 ఆ వీడియోలో ‘హాయ్, మేము మా దేవుడి టీమ్.. గబ్బర్ సింగ్ టీమ్. ఈరోజు శ్రీరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం... నువ్వు ఎన్ని సినిమాలు చేశావు? సినీ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ల నుంచి ఉన్నాను. నీ ముఖం ఎక్కడ చూడలేదు. 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ లో నీకు మెంబర్ షిప్ ఉంది? పవన్ కల్యాణ్ అమ్మ గురించి నువ్వు మాట్లాడతావా? ఒక ఆడదానివై ఉండి ఇలా మాట్లాడతావా? తోటి ఆడవారిపై ఇలా మాట్లాడతావా? ఈ విషయంలో మేము కచ్చితంగా వదిలిపెట్టం. పవన్ కల్యాణ్ గారికి మీరు ‘సారీ’ చెప్పాలి. సర్దార్ గబ్బర్ సింగ్ కు మేమందరం ఉన్నాం. నువ్వు ‘సారీ’ చెప్పేదాకా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరు’ అని ఆ వీడియోలో శ్రీరెడ్డిని హెచ్చరించారు.
Pawan Kalyan
srireddy
gabbar singh gang

More Telugu News