నేపాల్ లో భారత కాన్సులేట్ కార్యాలయం ముందు పేలుడు

  • నిన్న రాత్రి జరిగిన ఘటన
  • దెబ్బతిన్న గోడ... ఇతరత్రా ఎటువంటి నష్టం లేదు
  • దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
నేపాల్ లోని బిరత్ నగర్ ప్రాంతంలో భారత కాన్సులేట్ కార్యాలయం ముందు పేలుడు చోటు చేసుకుంది. దీని కారణంగా గోడ దెబ్బతినడమే తప్ప ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. మోరంగ్ ఎస్పీ అరుణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు... భారత కాన్సులేట్ తాత్కాలిక కార్యాలయం ముందు గత రాత్రి పేలుడు జరిగింది. దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక రాజకీయ గ్రూపుల పాత్ర ఉండొచ్చని సందేహిస్తున్నారు. ఎందుకంటే పేలుడు జరిగిన నిన్న బిరత్ నగర్ బంద్ కు ఓ రాజకీయ పార్టీ పిలుపునిచ్చింది.
Go Back to Shorts
nepal
blast

More Telugu News