తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత... కారణం చెప్పిన బ్యాంకు ఉన్నతాధికారులు!
- అత్యధిక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు
- నగదు లేక ప్రజల తీవ్ర అవస్థలు
- బ్యాంకుల్లో సైతం కరెన్సీ కొరత
- సెలవుల వల్ల ఇబ్బందన్న అధికారులు
క్యాష్ కష్టాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, ఇటీవలి కాలంలో వరుస సెలవులు రావడంతోనే ఈ ఇబ్బంది కలిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ కావడం లేదని చెబుతున్నారు. రద్దయిన నోట్ల స్థానంలో 80 శాతం కరెన్సీని కొత్త నోట్ల రూపంలో విడుదల చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో సర్క్యులేట్ కావడం లేదని వెల్లడించారు. తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా డబ్బును తెప్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, అతి త్వరలోనే ఏటీఎంలలో క్యాష్ నింపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.