తాజ్ మహల్ ను ఎవరికీ రాసివ్వలేదు.. వక్ఫ్ బోర్డుకి ఎలా చెందుతుంది?: మొఘల్ వారసుడి ప్రశ్న
- ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుపై మండిపడ్డ మొఘల్ వారసుడు
- సున్నీ వక్ఫ్ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోంది
- షాజహాన్ తాజ్ మహల్ ను ఎవరి పేరిటా రాయలేదు
తనకు తెలిసినంత వరకు షాజహాన్ తాజ్ మహల్ ను ఎవరి పేరిటా రాయలేదని అన్నారు. ఆయోధ్యలో రామ మందిరం నిర్మించకూడదని ఎందుకు ఆందోళనలు చేపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అన్ని మతాల వారిని దగ్గర చేసేందుకు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. తాజ్ మాది అని పేర్కొంటున్న సున్నీ వక్ఫ్ బోర్డు భూకబ్జాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మొఘల్ వారసులమైన తాము తాజ్ మహల్ ను భారత ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నామని ఆయన తెలిపారు. తాజ్ పేరుతో రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు