Vijayawada: విజయవాడలో మండుతున్న ఎండలు!
- విజయవాడలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- 40 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రత
- ఖాళీగా దర్శనమిస్తున్న ప్రధాన రహదారులు
- వడగాల్పుల తీవ్రత పెరుగుతున్న వైనం
విజయవాడలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈరోజు విజయవాడలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించట్లేదు. దీంతో, ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మరోపక్క, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండటంతో ముందుముందు ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈమేరకు వైద్యులు సూచించారు. కాగా, శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింత కుంటలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చింతకుంటలో పొలంలో పిడుగుపడి రైతు మృతి చెందాడు.
నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి : ఐఎండీ డీజీ రమేశ్
వరుసగా మూడో ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డీజీ రమేశ్ తెలిపారు. 97 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనాగా ఉందని, నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, తీరం తాకిన తర్వాత దేశమంతా విస్తరించేందుకు నలభై ఐదు రోజులు పడుతుందని అన్నారు. రెండో దశ రుతుపవనాల పరిస్థితిని జూన్ లో పరిశీలిస్తామని, ప్రతినెల రుతుపవనాల గమనాన్ని అంచనా వేసి వివరాలు అందిస్తామని రమేశ్ పేర్కొన్నారు.