నెటిజన్ల విమర్శలపై ఘాటుగా స్పందించిన అనసూయ!
- రంగస్థలం సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ
- సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఘాటు స్పందన
- వైవిధ్యభరితమైన పాత్రలు చేయడంలో తప్పు లేదు
'ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్ లకు పెళ్లిళ్లవడమే కాకుండా, పిల్లలు కూడా వున్నారు. ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదు' అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.