హీరోయిన్ శ్రీరెడ్డి పోరాటంపై పవన్ కల్యాణ్ స్పందన
Add ap7am to your home Screen

హీరోయిన్ శ్రీరెడ్డి పోరాటంపై పవన్ కల్యాణ్ స్పందన

  • అన్యాయం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలి
  • కోర్టు మెట్లు ఎక్కాలి
  • టీవీ షోలలో చర్చల వల్ల సమస్యకు పరిష్కారం దక్కదు
టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన పోరాటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని... అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. టీవీలలో చర్చల వల్ల ఏమీ రాదని... కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. సెన్సేషన్ కోసం కాకుండా, న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పారు. 
Pawan Kalyan
sri reddy
Jana Sena
comments

More Telugu News