కొరడాలతో కొట్టుకున్న ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు!
- హోదా, విభజన హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు
- భీమడోలులో మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు వినూత్న నిరసన
- మోదీ పతనం ఏపీ నుంచే ప్రారంభమైందన్న నేతలు
ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు పాల్గొని, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రులను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని మండిపడ్డారు. మోదీ పతనం ఏపీ నుంచే ప్రారంభమైందని అన్నారు. బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.