ఆ సీన్లు, డైలాగులు ఎందుకు తీసేయాలి?: మండిపడ్డ ఆర్.నారాయణ మూర్తి
- విడుదలకు సిద్ధమవుతోన్న ‘అన్నదాత సుఖీభవ’
- ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో సినిమా
- ముఖ్య సీన్లకు కట్స్ చెప్పిన సెన్సార్
తాను రైతుల సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమా తీశానని, సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన సీన్లను తొలగించమని సెన్సార్ వారు అంటున్నారని ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రజల ఆవేదనను తెలియజెప్పాలని చూడడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామిక వేత్తలు ఏం పుణ్యం చేశారు? అని అన్నారు. కోట్లాది రూపాయలు మోసం చేసి కొందరు పారిపోతున్నారని, రైతులను ఆదుకోవాలని సీన్లు తీయడం తప్పా? అని అడిగారు. భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేయడానికా? అని ప్రశ్నించారు. తాను సెన్సార్ బోర్డు నిర్ణయంపై పునర్విచారణ కమిటీ వద్దకు వెళతానని అన్నారు.