భారత మార్కెట్ కు ఈ- స్కూటర్లను తీసుకురానున్న హోండా
- జపాన్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనులు
- చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం
- వెల్లడించిన హోండా భారత విభాగం సీఈవో మినోరు కటో
అవసరమైన వివరాలను భారత విభాగం నుంచి తీసుకోవడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో అనుభవం ఉన్నప్పటికీ భారత కస్టమర్ల అభిరుచులను అందుకోవడం కష్టమైన పనిగా కటో పేర్కొన్నారు. ధర, వాహన శ్రేణి, పనితీరు పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే విధంగా బ్యాటరీ సామర్థ్యం ఉండాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పటిలోగా మార్కెట్ అందించగలరన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.