ఈ నెల 12న ఏపీ ఇంటర్‌ సెకండియర్‌, 13న ఫస్టియర్‌ పరీక్షా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయంపై విజయవాడలోని తమ కార్యాలయం నుంచి పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాజమహేంద్ర వరం నుంచి ఈ నెల 12న మధ్యాహ్నం విడుదల చేస్తామని, అలాగే, మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను విశాఖపట్నం నుంచి ఈ నెల 13 మధ్యాహ్నం విడుదల చేస్తామని తెలిపారు.

ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేస్తారని వివరించారు. ఈ కింది వెబ్‌సైట్ల నుంచి విద్యార్థులు పరీక్ష ఫలితాలను పొందవచ్చు..       
Go Back to Shorts
inter
Andhra Pradesh
Ganta Srinivasa Rao

More Telugu News