యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం.. సాక్షులు లేరని కేంద్ర మాజీ మంత్రిపై రేప్ కేసు ఎత్తివేత
- 2011లో కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందపై రేప్ కేసు
- హరిద్వార్ లోని ఆశ్రమంలో రేప్ చేశారన్న బాధితురాలు
- సీఆర్పీసీ సెక్షన్ 321 ప్రకారం కేసు విత్ డ్రా
అంతే కాకుండా రేప్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని కూడా బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన చిన్మయానంద అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో ఈ రేప్ కేసు పెండింగ్ లో పడిపోయింది. తాజాగా ఈ కేసును సీఆర్పీసీ సెక్షన్ 321 ప్రకారం విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వాధికారులు లేఖ రాశారు. దీంతో ఈ అత్యాచారం కేసులో సాక్షులు లేనందువల్ల.. ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ కేసు ఎత్తివేత నిర్ణయం వివాదాస్పదమవుతోంది.