భార్యకు పెళ్లి రోజు అభినందనలు తెలిపిన షమీ... ఆమెకంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్!
- 4వ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన షమీ
- కేక్ పిక్చర్ పోస్టు చేస్తూ 'మిస్ యూ' అని వ్యాఖ్య
- ఆమెకంత వ్యక్తిత్వం లేదంటున్న షమీ ఫ్యాన్స్
ఓ పెద్ద కేక్ బొమ్మను పోస్టు చేస్తూ, "నా బెబోకు నాలుగవ వివాహ వార్షికోత్సవ కేక్. మిస్ యూ" అని మెసేజ్ పెట్టాడు. ఇక ఈ పోస్టు పెట్టిన తరువాత, నీ నుంచి అభినందనలు అందుకోవాల్సినంత గొప్ప క్యారెక్టర్ ఏమీ హసీన్ కు లేదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆమెకు అంత సీను లేదని, విషెస్ చెప్పాల్సినంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది కాదని ట్రాల్ చేస్తున్నారు.
కాగా, గత నెల 6వ తేదీన సోషల్ మీడియా వేదికగా, హసీన్ జహాన్ పోస్టులు పెడుతూ, తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని, తనను హింసించాడని, తమ్ముడితో రేప్ చేయించాలని చూశాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.