Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒప్పో ఎఫ్7 ఫోన్లు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు... నేటి నుంచి ఓపెన్ సేల్స్

  • ఫ్లిప్ కార్ట్, అమేజాన్, మొబైల్ స్టోర్లలో అందుబాటు
  • గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన మోడల్
ఐఫోన్ ఎక్స్ మాదిరిగా ఉండే ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్లు నేటి నుంచి ఓపెన్ సేల్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తో పాటు మొబైల్ దుకాణాల్లోనూ దర్శనమివ్వనున్నాయి. ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ గత నెలలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం విదితమే. ఇది రెండు రకాల కాన్ఫిగరేషన్ తో లభిస్తోంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ఉన్న మోడల్ ధర రూ.21,990. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.26,990. ఫ్లిప్ కార్ట్ పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.1,000 వరకు తగ్గింపునిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై చెల్లిస్తే 5 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

ఈ ఫోన్లలో 25 మెగా పిక్సల్స్ సెల్ఫీ కెమెరా, ఎఫ్ 2.0 అపెర్చర్, 6.23 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 19.9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 64 బిట్ మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్ న్నాయి. ఒప్పో ఎఫ్7 ఇప్పటి వరకు ఫ్లాష్ సేల్ రూపంలో అమ్ముడైన విషయం తెలిసిందే.
oppo f7
opensale

More Telugu News