Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇండొనేషియా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి... లవ్ ఎట్ ఆస్ట్రేలియా!

  • ఆస్ట్రేలియాలో ప్రేమగా మారిన స్నేహం
  • పెళ్లికి రెండు కుటుంబాల పెద్దల అంగీకారం
  • వైభవంగా జరిగిన పెళ్లి
ప్రేమకు ప్రాంతీయతత్వం, భాషా భేదం ఉండదని నిరూపించిందో జంట. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఇండొనేషియా, ఇంకెక్కడి ఆస్ట్రేలియా... ప్రేమ బంధం వారిద్దరినీ దగ్గర చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం కడుమూరుకు చెందిన సురేష్‌ గౌడ్‌ దాదాపు పదేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే ఉద్యోగంలో స్థిరపడగా, ఆయన పని చేసే సంస్థలోనే ఇండొనేషియాకు చెందిన అన్నవి అనే యువతి చేరింది. వీరిద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారగా, ఇద్దరూ కలసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించడంతో, ఆదివారం నాడు చేవెళ్ల మండలం ఇంద్రారెడ్డినగర్‌ లో సురేష్, అన్నవిల వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి వధువు తల్లితో పాటు అన్న, చెల్లెలు కూడా రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నూతన జంటను పలువురు బంధుమిత్రులు ఆశీర్వదించారు.
India
Indonesia
Australia
Love Marriage

More Telugu News