అకీరాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు రేణూ దేశాయ్ భావోద్వేగం!
Add ap7am to your home Screen

అకీరాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు రేణూ దేశాయ్ భావోద్వేగం!

  • 14వ బర్త్ డే జరుపుకుంటున్న అకీరా
  • సామాజిక మాధ్యమాలు వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువ
  • ఓ పోస్ట్ లో థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్
పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ ల తనయుుడు అకీరా నందన్ ఈరోజు తన 14వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. సామాజిక మాధ్యమాలు వేదికగా అకీరాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా కుటుంబ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు అకీరాకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అకీరాకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ రావడంపై రేణూ దేశాయ్ భావోద్వేగం చెందారు. ఈ మేరకు ‘ఫేస్ బుక్’లో ఓ పోస్టు చేశారు. ‘నా కుమారుడిపై చూపిస్తున్న ఆదరాభిమానులకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అకీరాకు 14 ఏళ్లు వచ్చాయి కనుక, టెక్నికల్ గా చూస్తే బేబీ బోయ్ ఏమీ కాదు కానీ, జన్మనిచ్చిన తల్లిగా నేను ఎప్పటికీ తనను చిన్నారిగానే భావిస్తాను. తల్లి, తండ్రి తరపున గొప్ప వ్యక్తులున్న కుటుంబంలో అకీరా జన్మించాడు.. మీరు రాత్రి  నుంచి చెబుతున్న బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్ కి అకీరా తల్లి గా ఎంతో భావోద్వేగం చెందాను. మీ అందరికీ నా లిటిల్ బర్త్ డే బోయ్ తరపున థ్యాంక్యూ’ అని ఆ పోస్ట్ల్ లో పేర్కొన్నారు. 
Pawan Kalyan
renu desai

More Telugu News