శ్రీరెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చెయ్యొద్దని మీడియాను కోరుకుంటున్నా: నటి హేమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీరెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చెయ్యొద్దని మీడియాను కోరుకుంటున్నా: నటి హేమ

  • శ్రీరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు
  • ‘మా’ కార్డు కోసం ఇచ్చిన అప్లికేషన్ ని శ్రీరెడ్డి సరిగా నింపలేదు
  • నటించే అవకాశాలు మన చేతుల్లో ఉండవు
  • చాలా కాలంగా నాకు నటించే అవకాశాలు రావడం లేదు
శ్రీరెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చెయ్యెుద్దని మీడియాను కోరుకుంటున్నానని సీనియర్ నటి హేమ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శ్రీరెడ్డి వ్యవహారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా, తాను ఒక్కరోజు కూడా స్పందించకపోవడానికి కారణం, ఆమె వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని చెప్పింది. గతంలో జరిగిన బోర్డు మీటింగ్ లో ఓ పెద్ద డైరెక్టర్ పై ఓ అమ్మాయి తమకు ఫిర్యాదు చేసిందని, ఆ దర్శకుడిని పిలిపించాము కానీ, ఫిర్యాదు చేసిన ఆ అమ్మాయి రాలేదని అన్నారు. ‘మా’ కార్డు కావాలని అడుగుతున్న శ్రీరెడ్డికి అప్లికేషన్ ఇచ్చామని, సరిగ్గా నింపలేదు, అందుకే, తిరస్కరించామని అన్నారు. సినిమాల్లో తనకు వేషాలు ఇవ్వడం లేదని శ్రీరెడ్డి అనడం సబబు కాదని, తనకు కూడా చాలా కాలంగా నటించే అవకాశాలు రావడం లేదని, అలా అని చెప్పి ఇండస్ట్రీపై ఫిర్యాదు చేస్తానా? అని ప్రశ్నించారు. అవకాశాలు రాకుండా ఉన్న ఆర్టిస్ట్ లు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని, నటించే అవకాశాలు రావడం, రాకపోవడమనేది మన చేతుల్లో ఉండదని, బట్టలు విప్పేసుకుంటే వేషాలిస్తారనుకోవడం తప్పని హితవు పలికింది.
hema
srireddy

More Telugu News