పెళ్లిపీటలు ఎక్కుతున్న మరో హీరోయిన్... సినిమాటోగ్రాఫర్ తో రహస్యంగా గాయత్రి కృష్ణన్ నిశ్చితార్థం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లిపీటలు ఎక్కుతున్న మరో హీరోయిన్... సినిమాటోగ్రాఫర్ తో రహస్యంగా గాయత్రి కృష్ణన్ నిశ్చితార్థం!

  • గత కొన్నేళ్లుగా జీవన్ రాజ్ తో గాయత్రి ప్రేమాయణం
  • సీక్రెట్ గా నిశ్చితార్థం 
  • వచ్చే ఏడాది వివాహం
పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్ గాయత్రి కృష్ణన్ ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ జీవన్ రాజ్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ నిశ్చితార్థం గతవారం సీక్రెట్ గా సాగగా, వచ్చే సంవత్సరంలో పెళ్లి జరగనుంది. కాగా, తాము ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నప్పటికీ, రెండు కుటుంబాలూ వివాహానికి అంగీకరించాయని గాయత్రి వెల్లడించింది. పెళ్లి తరువాత కూడా తాను నటిస్తానని, తాము సాధించాల్సిన విజయాలు ఇంకా ఉన్నాయని చెప్పుకొచ్చింది. కాగా, కోలీవుడ్ లో 'జోకర్‌' చిత్రంతో పరిచయమైన గాయత్రి కృష్ణన్‌, ఆపై పలు మలయాళ సినిమాల్లోనూ నటించారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘మేర్కు తొడర్చి మలై’ త్వరలో విడుదల కానుంది.
Kolywood
Tamil
Actress Gayatri Krishnan

More Telugu News