వెళ్లండి.. ఇంటికెళ్లి నిద్రపోండి.. అభిమానులతో సల్మాన్
- సల్మాన్‌కు బెయిలు రావడంతో అభిమానుల సంబరాలు
- జోధ్‌పూర్ జైలుకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు
- ముంబైలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన నటుడు
20 ఏళ్లపాటు కొనసాగిన కృష్ణ జింకల వేట కేసులో గురువారం జోధ్‌పూర్ సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు జైలులో గడిపిన సల్మాన్‌కు శనివారం కోర్టు రూ.50 వేల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది.
సల్మాన్ విడుదల కానున్న విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కొందరు అభిమానులు పూల దండలు తీసుకొచ్చారు. ‘సల్మాన్ జిందాబాద్’, ‘సల్మాన్ మేమంతా నీ వెంటే’ అంటూ నినాదాలు చేశారు. కొందరు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.