జైల్లోంచి సల్మాన్ ఖాన్‌ విడుదల.. సంబరాలు చేసుకుంటోన్న అభిమానులు.. మండిపడ్డ పెటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జైల్లోంచి సల్మాన్ ఖాన్‌ విడుదల.. సంబరాలు చేసుకుంటోన్న అభిమానులు.. మండిపడ్డ పెటా

  • కృష్ణ జింకలను వేటాడిన కేసు
  • భారీ భద్రత నడుమ ఇంటికి వెళుతోన్న సల్మాన్‌
  • సల్మాన్‌కి బెయిల్‌ ఇవ్వడాన్ని ఖండించిన పెటా
కృష్ణ జింకలను వేటాడిన కేసులో రెండు రోజుల క్రితం జైలుకి వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి ఈ రోజు కోర్టులో బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జోధ్‌పూర్‌ జైల్లోంచి విడుదలయ్యారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీసులు ఇంటికి తరలిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్దకు అభిమానులు భారీగా చేరుకుని, ఆయనకు బెయిల్‌ రావడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, సల్మాన్‌కి బెయిల్ రావడం పట్ల  పెటా (పీపుల్ ఫ‌ర్ ఎథిక‌ల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమ‌ల్స్) స్పందించింది. సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. కృష్ణ జింకలను చంపిన సల్మాన్ ఖాన్‌ మళ్లీ బయటకు వచ్చి మళ్లీ తన సినిమా స్టార్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ కనబడితే, వన్య ప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎలా మారుతారని ప్రశ్నించింది. వన్య ప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ తేలికగా బెయిల్‌పై బయటకు రావడం మంచిది కాదని పేర్కొంది.  
jail
Salman Khan

More Telugu News