రెజ్లింగ్ లో విషాదం.. బౌట్ లో ప్రత్యర్థి ఎత్తుకి ప్రాణం కోల్పోయిన రెజ్లర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెజ్లింగ్ లో విషాదం.. బౌట్ లో ప్రత్యర్థి ఎత్తుకి ప్రాణం కోల్పోయిన రెజ్లర్!

  • మహారాష్ట్ర కోల్హాపూర్‌ లోని బండివేడ్‌ లో జ్యోతిబా జాతర నిర్వహణ 
  • జాతర సందర్భంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీలు
  • డిఫెన్స్ ఆడుతూ ప్రత్యర్థిన విసిగించిన నీలేశ్ కందుర్కర్
మహారాష్ట్రలో జరిగిన రెజ్లింగ్‌ పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. బౌట్‌ లో ప్రత్యర్థితో పోరాడుతూ స్పృహ కోల్పోయిన రెజ్లర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాని వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని కోల్హాపూర్‌ లో జ్యోతిబా జాతర సందర్భంగా బండివేడ్‌ ప్రాంతంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక రెజ్లర్ నీలేశ్ కందుర్కర్ (20) పాల్గొన్నాడు. తొలి బౌట్‌ లోనే నీలేశ్‌ కు బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. డిఫెన్స్ ప్రధానంగా ఆడే నిలేశ్ ప్రత్యర్థి పాయింట్లు సాధించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన ప్రత్యర్థి రెజ్లర్ నిలేశ్ ను అమాంతం గాల్లోకి లేపి పట్టువిడిపించుకునే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో అదుపుతప్పిన నిలేశ్ కిందపడ్డాడు. శరీరం బరువు మొత్తం మెడపై పడడంతో స్పృహ కోల్పోయాడు. సంబరాల్లో ప్రత్యర్థి మునిగిపోగా, తేరుకున్న నిర్వాహకులు వెంటనే అతన్ని కోల్హాపూర్‌ లోని మెట్రో హాస్పిటల్‌ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి కరాడ్‌ లోని కృష్ణ హాస్పిటల్‌ కు తరలించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేసిన వైద్యులు నాలుగు రోజులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆటలో ఊహించని విధంగా జరిగిన ఘటన కావడంతో ప్రత్యర్థి పేరు వెల్లడించడం లేదని, జరిగిన సంఘటనతో అతను షాక్ లోకి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు. 
Maharashtra
wrestling
player dead

More Telugu News