Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘మోదీనే నాకు స్ఫూర్తి’ అన్న అల్లు అర్జున్ పై విమర్శల వర్షం

  • సాధారణ వ్యక్తి నుంచి పీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ
  • యువత ఆదర్శంగా తీసుకుంది
  • మోదీ స్ఫూర్తితోనే నేను ముందుకు వెళుతున్నా
  • ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ మ్యాగజైన్ కు బన్నీ ఇంటర్వ్యూ
ప్రధాని నరేంద్ర మోదీయే తనకు ప్రేరణ, స్ఫూర్తి అని, వాటితోనే తాను ముందుకు సాగుతున్నానంటూ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీకి చేసిన అన్యాయంపై ప్రధాని మోదీపై నాయకులు, ప్రజలు మండిపడుతున్న నేపథ్యంలో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

దీంతో, సోషల్ మీడియా వేదికగా బన్నీపై విమర్శలు కురుస్తున్నాయి. సాధారణ వ్యక్తి నుంచి పీఎం స్థాయికి ఎదిగిన మోదీని యువత ఆదర్శంగా తీసుకున్నారని, తాను కూడా అదేవిధంగా స్ఫూర్తి పొందానని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ, ఈ విషయాన్ని పట్టించుకోని నెటిజన్లు వేరే విధంగా ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం ఉద్ధృతంగా పోరాటం జరుగుతున్న తరుణంలో మోదీ తనకు స్ఫూర్తి అని బన్నీ చెప్పడం వల్లే ఈ విమర్శలు తలెత్తాయని అభిప్రాయపడుతున్నారు.
Tollywood
Allu Arjun

More Telugu News