Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం' వారం రోజుల వసూళ్లు .. రికార్డుల దిశగా పరుగులు

  • 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ 
  • వారం రోజుల్లో 130 కోట్ల గ్రాస్
  • రెండోవారంలో కొత్త రికార్డులు ఖాయం 
చరణ్ .. సమంత జంటగా సుకుమార్ 'రంగస్థలం' సినిమాను తెరకెక్కించాడు. క్రితం నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను సాధించి అందరిచేతా ఔరా! అనిపించింది. వారం రోజులు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ ను .. 81 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను రాబట్టినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 80 కోట్లకు అమ్మారు. వారం రోజుల వసూళ్లు ఈ మార్క్ దాటిపోవడంతో, ఇకపై వచ్చేవన్నీ లాభాలేనని అంటున్నారు. దగ్గర్లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో భారీ లాభాలు ఖాయమని చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే, టాలీవుడ్లో ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్ల లిస్టులో వున్న 'శ్రీమంతుడు' .. 'జనతా గ్యారేజ్' .. 'అత్తారింటికి దారేది' .. 'జై లవకుశ'లను అధిగమించడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.    
charan
samanta

More Telugu News