రెండు కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన కాజల్!

  • తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి క్రేజ్ 
  • అగ్రహీరోలతో అనేక హిట్స్
  • హీరో ప్రధానమైన సినిమాలే చేస్తుందట  
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్ కి ఎంతో క్రేజ్ వుంది. రెండు భాషల్లోని అగ్రకథానాయకులతోను ఆమె ఎన్నో సినిమాలు చేసింది .. మరెన్నో విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటోంది. అలాంటి కాజల్ కి రెండు కోట్లు ఇస్తామంటూ రీసెంట్ గా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట.

 ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు, కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ కి కాజల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించిన ఆయన, రెండు కోట్లు ఆఫర్ చేశాడట. అనుష్క .. నయనతార మాదిరిగా కథా భారాన్ని పూర్తిగా మోసే పాత్రలను తాను ఇంతవరకూ చేయలేదనీ, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ఆ భారీ ఆఫర్ ను సున్నితంగా కాజల్ తిరస్కరించిందని సమాచారం. మరికొంతకాలం పాటు హీరోలతో కలిసి ఆడిపాడే పాత్రలను చేయడమే బెటర్ అని కాజల్ భావిస్తోందట.     
kajal

More Telugu News