మూడు జింకల్ని వేటాడి దొరొకిపోయిన మరో ‘ఖాన్’!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు జింకల్ని వేటాడి దొరొకిపోయిన మరో ‘ఖాన్’!

  • మార్చి 30న వేటకు వెళ్లిన దంతవైద్యుడు ముజాహిద్ అలీఖాన్
  • కర్ణాటక సరిహద్దుల్లో సన్నిహితులతో కలసి వేట
  • తిరిగి వచ్చే క్రమంలో అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో నిందితుడిగా జోధ్ పూర్ జైలుకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే మరో వ్యక్తి, హైదరాబాద్ కు చెందిన దంత వైద్యుడు కూడా ఇదే విధంగా వేటాడి అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్ ముజాహిద్ అలీఖాన్ ఈ మార్చి 30న ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ లోని సెక్షన్ 9, 51 కింద అరెస్టయ్యాడు. ఆయనతోపాటు మరో నలుగుర్ని కూడా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.

మూడు కృష్ణ జింకలను చంపారనే అభియోగాలను వీరిపై మోపారు. ఆయుధాల లైసెన్స్ ను దుర్వినియోగం చేసినట్టు కూడా ఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ ఖాన్ వేట సరదా తీర్చుకునేందుకు కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతానికి సన్నిహితులతో కలసి వెళ్లారు. మూడు కృష్ణ జింకల్ని తన లైసెన్స్ డ్ ఆయుధంతో చంపి మాంసాన్ని తీసుకెళుతున్న క్రమంలో కర్ణాటక పోలీసులకు పట్టుకున్నారు. ఖాన్ 2014లోనూ ఇలానే వేటాడి దొరికిపోయారు.
BLACK BUCK
KHAN

More Telugu News