బాలుడిపై బాలీవుడ్ నిర్మాత లైంగిక వేధింపులు... మారిషస్ లో కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలుడిపై బాలీవుడ్ నిర్మాత లైంగిక వేధింపులు... మారిషస్ లో కేసు

  • షూటింగ్ లొకేషన్ల కోసం మారిషస్ వెళ్లిన సందీప్ సింగ్
  • హోటల్లో స్విట్జర్లాండ్ బాలుడు పరిచయం
  • గత నెల 29న తన గదికి తీసుకెళ్లి లైంగిక వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
'భూమి', 'సర్బ్ జిత్' హిందీ చిత్రాల నిర్మాత సందీప్ సింగ్ మారిషస్ లో ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సందీప్ సింగ్ ఓ సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను ఎంపిక చేసేందుకు గత నెల చివర్లో మారిషస్ వెళ్లారు. ఓ హోటల్లో బస చేశారు. అదే హోటల్లో స్విట్జర్లాండ్ కు చెందిన ఓ కుటుంబ సభ్యులు కూడా విడిది చేశారు. ఆ కుటుంబానికి చెందిన బాలుడ్ని సందీప్ సింగ్ పరిచయం చేసుకున్నాడు. సమీపంలోని బీచ్ లో బాలుడ్ని కలుసుకుని సినిమాలు, సంగీతం గురించి మాట్లాడాడు. అలా మాట్లాడుకుంటూనే సందీప్ సింగ్ బాలుడ్ని తన గదికి తీసుకెళ్లి అతడిపై లైంగిక వైధింపులకు పాల్పడ్డారు.

అయితే, ఆ బాలుడు అక్కడి నుంచి ఏదోలా తప్పించుకుని తన గదికి వెళ్లి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే వారు బయటకు వచ్చి చూడగా సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ కనిపించలేదు. హోటల్ సిబ్బందికి బాలుడి తండ్రి చెప్పే ప్రయత్నం చేసినాగానీ వారు వినిపించుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో మార్చి 29న మారిషస్ లోని బీచ్ కాంబర్ ఫ్యామిలీ హోటల్ 221వ గదిలో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, సందీప్ సింగ్ మార్చి 30న మారిషస్ నుంచి భారత్ కు తిరిగొచ్చారు.

BOLLYWOOD
PRODUCER
Sandeep Singh

More Telugu News