చంద్రబాబుతో భేటీ అయిన కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చలు!

  • ఆంధ్ర భవన్ కు వెళ్లిన కేజ్రీవాల్
  • ఉదయం 9 గంటల సమయంలో భేటీ
  • కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. ఆంధ్రభవన్ కు వెళ్లి 9 గంటల సమయంలో చంద్రబాబుతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై వీరిద్దరూ చర్చించారు. గత రెండు రోజులుగా చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆయన వివిధ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. నిన్న పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, అప్నా దళ్, శిరోమణి అకాలీదళ్, టీఎంసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
Go Back to Shorts
Chandrababu
aravind kejriwal
meeting

More Telugu News