శారదగారు నిజంగానే నన్ను కొట్టేశారు .. తరువాత ఏడ్చేశారు: రోజా రమణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శారదగారు నిజంగానే నన్ను కొట్టేశారు .. తరువాత ఏడ్చేశారు: రోజా రమణి

  • 'మనుషులు మారాలి' తమిళంలో చేశారు 
  • శారద కూతురుగా నటించాను
  • పాత్రలో ఆమె ఇన్వాల్వ్ కావడం వలన అలా జరిగింది  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న రోజారమణి, ఒక సినిమా షూటింగులో తనకి ఎదురైన అనుభవాన్ని గురించి ప్రస్తావించారు. "తెలుగులో వచ్చిన 'మనుషులు మారాలి' సినిమాను తమిళంలో చేసినప్పుడు నేను శారదాగారి కూతురుగా నటించాను. కథా పరంగా ఆ కుటుంబం చాలా సమస్యలతో ఉంటుంది"

"దాంతో కూతురు పాత్రలో వున్న నేను వెళ్లి ఒక బ్రెడ్ లాంటిదేదో దొంగతనం చేస్తాను. దాంతో ఆ కొట్టువాడు దొంగబుద్ధి అంటూ చాలా అవమానకరంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న తల్లి పాత్రలోని శారద గారు.. నేను పరిగెడుతూవుంటే వెంటపడి మరీ కొట్టాలి. ఆ సీన్లో ఆమె నిజంగానే నన్ను కొట్టేశారు. ఆ తరువాత సారీ చెబుతూ నన్ను పట్టుకుని ఏడ్చేశారు. పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ కావడం వలన ఆమె అలా చేశారని ఆ తరువాత అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చారు.      
sharada
rojaramani

More Telugu News